జీహెచ్‌ఎంసి పరిధిలో 2.50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం- కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-06-22T23:30:53+05:30 IST

ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు15వ తేదీ వరకూ ఆరవ విడత తెలంగాణకు హరితహారం అమలుచేయనున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు

జీహెచ్‌ఎంసి పరిధిలో 2.50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం- కేటీఆర్‌

హైదరాబాద్‌: ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు15వ తేదీ వరకూ ఆరవ విడత తెలంగాణకు హరితహారం అమలుచేయనున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 25న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభిస్తారని అన్నారు. ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసి పరిధిలో 2కోట్ల 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసి పరిధిలో 700 ట్రీ పార్కులతో పాటు 75 చోట్ల యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ను చేపట్టనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఉస్మానియా, సెంట్రల్‌ యూనివర్శిటీ, ఎన్‌జిఆర్‌ఐలతో పాటు ఎక్కువ స్థలాలు ఉన్న సంస్థలు, ఖాళీ ప్రదేశాలు ఉన్న దేవాలయాల భూముల్లో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ కింద విరివిగా మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో డివిజన్‌ గ్రీన్‌ ప్రణాళికలు అమలుచేయనున్నట్టు వెల్లడించారు.


సోమవారం జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో హరింత హారం అమలు పై కార్పొరేటర్లు, జోనల్‌, డిప్యూటీ కమిషనర్లతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన మున్సిపల్‌శాఖ మంత్రి   కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 2.50 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించినట్టు తెలిపపారు. మానవ ఇతిహాసంలో ఇంత పెద్దయెత్తున మొక్కలు నాటే ప్రయత్నం ఇదే మొదటిసారి అన్నారు. దేశంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యక్రమాన్నిరూపొందించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు.


వచ్చే తరానికి ఆహ్లాదకర మైన వాతావరణాన్ని అందించడమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ప్రతి డివిజన్‌ పరిధిలో కాలనీలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కులు, లే అవుట్స్‌ ఖాళీస్థలాలు , చెరువులు, కుంటలు, నాలాల పై మొక్కలు నాటేందుకు ఈనెల 30లోపు గ్రీన్‌యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల, స్మశాన వాటికలు, దేవాలయాలు, వక్ఫ్‌ఆస్తులు, చర్చీలలో ఉన్నఖాళీ ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులు, నిర్వాహకులతో చర్చించి మొక్కలు నాటించాలని అన్నారు. 


ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌మాట్లాడుతూ హరితహారం అమలుకు కాలనీ వవాసులు, రెసిడెన్షియల్‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌లతో చర్చించి సమన్వయంతో పనిచేయాలని కార్పొరేటర్లకు సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ నగరంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు వే గంగా పూర్తయ్యాయని తెఇలపారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్నిఆస్తిగా అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందన్నారు. హరితహారంలో పాల్గొనే వారికి శానిటైజర్లు, మాస్కులు అందజేయాలని అన్నారు. ఇల్లు, పరిసరాల్లో, కాలనీలలో రోడ్లు, పార్కులను హరితమయం చేయాలని విజ్ఞప్తిచేశారు.  

Updated Date - 2020-06-22T23:30:53+05:30 IST