డాక్టర్లు, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ ట్వీట్

ABN , First Publish Date - 2020-03-24T20:23:12+05:30 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

డాక్టర్లు, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే డాక్టర్లు, జర్నలిస్టులను కూడా అడ్డుకోవడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను అడ్డుకోవడంపై మీడియా నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


మంత్రి కేటీఆర్‌కు దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు వైద్యులు, మీడియా నుంచి చాలా ఫిర్యాదులు అందాయన్నారు. అంతేకాకుండా దీనిపై దృష్టి పెట్టి.. మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇది పరీక్షా సమయమని అందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు.

Updated Date - 2020-03-24T20:23:12+05:30 IST

Read more