జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-06T22:19:29+05:30 IST
జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ..

హైదరాబాద్: జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిన డివిజన్లలో ఓడిన వారిని దూరం పెట్టకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని, ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. సిట్టింగ్‌లను మార్చిన దగ్గర గెలిచామన్న ఆయన.. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలా మంది ఓడిపోయారన్నారు. ఇక్కడే లెక్క తప్పిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని, గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుందామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలన్నారు.