ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

ABN , First Publish Date - 2020-07-15T21:38:42+05:30 IST

హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఐటీ కంపెనీల ప్రతినిధులు

ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

హైదరాబాద్: హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలను నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు... భవిష్యత్తులో రానున్న ఐటీ కంపెనీల ఏర్పాటు వాటికి సంబంధించిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఐటీని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీని తీసుకువస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమలు అభివృద్ది చెందుతాయని ఆయన చెప్పారు. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్‌కి తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-07-15T21:38:42+05:30 IST