సీఎంతో కేటీఆర్ భేటీ
ABN , First Publish Date - 2020-12-05T09:23:49+05:30 IST
జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఫలితాలపై విశ్లేషణ

ఫలితాలపై చర్చ
హైదరాబాద్, డిసెంబర్ 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఫలితాలపై విశ్లేషణ చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్.. తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ప్రజాతీర్పుపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.