కంటోన్మెంట్‌ రోడ్లను ఎప్పుడు పడితే అప్పుడు మూసివేస్తున్నారు- కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-08-17T01:14:01+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రోడ్లను అధికారులుఎప్పుడు పడితే అప్పుడు మూసి వేస్తున్నారు.

కంటోన్మెంట్‌ రోడ్లను ఎప్పుడు పడితే అప్పుడు మూసివేస్తున్నారు- కేటీఆర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రోడ్లను అధికారులుఎప్పుడు పడితే అప్పుడు మూసి వేస్తున్నారు. అవసరం ఉన్నా సరైన కారణాలు లేకుండానే ఆర్మీ అధికారులు పదే పదే రోడ్లను వేసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. లక్షలాది మంది నిరంతరం నిరంతరం ఈప్రాంతంగుండా ప్రయాణీస్తుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మూసివేయడంతో అటు వైపు ప్రయాణిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు లేఖ రాశారు. ప్రజల అవస్థల్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్ల మూసివేతలో ప్రత్యేకమైన స్టాండర్డ్‌ ప్రోటోకాల్‌పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని, అయితే అలాంటి ఆదేశాలను స్థానిక ఆర్మీ అధికారులు ఏమాత్రం పాటించడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


రోడ్లమూసి వేతకు సంబంధించిన వివరాలు కనీసం మూడుస్థానిక న్యూస్‌ పేపర్లలో ప్రచురించడంతో పాటు కంటోన్మెంట్‌బోర్డు వెబ్‌సైట్‌లో తెలియజేయాలని, దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే మూసి వేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రక్రియను ఏమాత్రం ఇక్కడి స్థానిక ఆర్మీ అధికారులు పాటించడం లేదని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభంలోనూ అధికారులు ఇష్టారీతిన రోడ్లను మూసి వేస్తున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అలహాబాద్‌ గేట్‌, ఘూస్‌రోడ్‌, వెల్లింగ్టన్‌, ఆర్డినెన్స్‌ రోడ్డు వంటి వాటిని జూలై నెలలో పది రోజుల పాటు కేవలం నగరంలో కోవిడ్‌కేసులుపెరుగుతున్నాయన్న సాకు చూపించి మూసివేశారని అన్నారు.


దీంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. స్థానిక అధికారులకు రోడ్లమూసివేతకు సంబంధించి ప్రామాణిక పద్దతులు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసందర్భంగా కేటీఆర్‌ కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు సికింద్రాబాద్‌కంటోన్మెంట్‌ బోర్డుకి ఎన్నిక కాబడిన కౌన్సిల్‌ ఉన్ననేపధ్యంలో మూసివేతకు సంబంధించి బోర్డును సంప్రదించేలా ఆదేశాలివ్వాలని కోరారు. పదే పదే రోడ్లు మూసి వేతను ఆపి లక్షలాది మంది ప్రజల ప్రయాణానికి ఊరటనివ్వాలని , ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కేటీఆర్‌ కోరారు. 

Updated Date - 2020-08-17T01:14:01+05:30 IST