కేటీఆర్‌ ఫాంహౌస్‌ అక్రమ నిర్మాణమే: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-04T09:35:56+05:30 IST

పట్టణప్రగతి కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామంటున్న మునిసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తానే స్వయంగా జీవో 111కు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి

కేటీఆర్‌ ఫాంహౌస్‌ అక్రమ నిర్మాణమే: జీవన్‌రెడ్డి

జీవో 111కు తూట్లు పొడుస్తున్నారు.. దాన్ని కూల్చేయాల్సిందే

ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం దారుణం: కాంగ్రెస్‌, టీడీపీ

కరీంనగర్‌ అర్బన్‌/హైదరాబాద్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పట్టణప్రగతి కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామంటున్న మునిసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తానే స్వయంగా జీవో 111కు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో ఆరోపించారు. ‘హైదరాబాద్‌ శివారులోని హిమాయత్‌సాగర్‌, గండిపేట పరీవాహక ప్రాంతాన్ని రక్షించేందుకు జీవో 111 ప్రకారం అక్రమ కట్టడాలను కూల్చివేయాలి. అయితే.. రంగారెడ్డి జిల్లా జొన్వాడలో నిబంధనలను ఉల్లంఘించి 25 ఎకరాల్లో మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌ నిర్మించుకున్నారు’ అని ఆరోపించారు. అక్రమ ఫాంహౌ్‌సను కూల్చివేయాలని టీడీపీ-టీఎస్‌ నేత నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-04T09:35:56+05:30 IST