మంత్రి కేటీఆర్ రోడ్‌షో.. భారీగా ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2020-11-22T04:12:17+05:30 IST
మంత్రి కేటీఆర్ రోడ్‌షోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బాలానగర్ వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చింతల్ నుంచి బాలానగర్ వరకు..

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ రోడ్‌షోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బాలానగర్ వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చింతల్ నుంచి బాలానగర్ వరకు 6 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కాగా మంత్రి ఎన్నికల ప్రచారం రోజుగా జరుగుతోంది. ఆదివారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జహీరానగర్ చౌరస్తా, ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా, శ్రీరామ్ నగర్ చౌరస్తా, యూసఫ్ గూడ చెక్ పోస్ట్ చౌరస్తాలో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు.