కరోనాతో సహజీవనం చేస్తున్నాం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-07-08T18:14:10+05:30 IST

కరీంనగర్: జిల్లాలోని చొప్పదండిలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేస్తున్నామని..

కరోనాతో సహజీవనం చేస్తున్నాం: కేటీఆర్

కరీంనగర్: జిల్లాలోని చొప్పదండిలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేస్తున్నామని.. కరోనా వచ్చినా.. రాష్ట్ర ప్రగతి ఆగలేదన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రైతాంగానికి పెద్ద పీట వేశామన్నారు. ఇప్పుడు ఎన్నికలేవీ లేవని.. 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్ పదవి పోతుందన్నారు. హరితహారానికి.. రాజకీయానికీ సంబంధం లేదన్నారు. కరీంనగర్‌లోనే అటవీ శాతం తక్కువ ఉందన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-07-08T18:14:10+05:30 IST