కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడినా ఎదురుదాడి చెయ్యండి: కేటీఆర్

ABN , First Publish Date - 2020-08-01T19:21:51+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడినా ఎదురుదాడి చెయ్యండి: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఇప్పట్లో పోయేలా లేదన్నారు. ఇంకా కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఎలాంటి కొరత ఉన్నా వెంటనే స్పందించాలని కేటీఆర్ సూచించారు. ప్లాస్మా దాతలపై ఫోకస్ పెట్టాలన్నారు. వారిని ప్రోత్సహించాలని... ప్రతి జిల్లాలో పార్టీ భవనాల నిర్మాణం పూర్తి చెయ్యాలన్నారు. విపక్షాల విషయంలో రాజీ పడవద్దని.. కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఎదురుదాడి చెయ్యాలని కేటీఆర్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-01T19:21:51+05:30 IST