కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ABN , First Publish Date - 2020-07-25T08:17:58+05:30 IST

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శుక్రవారం కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ..

కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

భారీగా టీఆర్‌ఎస్‌ సేవా కార్యక్రమాలు

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో విస్తృత కార్యక్రమాలు


హైదరాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శుక్రవారం కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సీనీ, క్రీడ, వివిధ రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరుతో పేదలు, అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేశారు. మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ ప్రముఖులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


మంత్రి కేటీఆర్‌ మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, ఆకాంక్షించారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య అంటూ ట్వీట్‌ చేశారు.  ‘‘నా లాంటి చెల్లెలు ఉన్నందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నీ లాంటి రాక్‌ స్టార్‌ అన్నయ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.’’అని కేటీఆర్‌ సోదరి, మాజీ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 


థాంక్స్‌ అన్నా..! జగన్‌, పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు

మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’’అని జగన్‌ ట్వీట్‌ చేశారు. వారి ట్వీట్లకు... ‘థాంక్స్‌ అన్నా’ అని కేటీఆర్‌ బదులిచ్చారు. 

Updated Date - 2020-07-25T08:17:58+05:30 IST