తెలంగాణకు బాండ్లకు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2020-04-15T08:55:08+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ బాండ్లకు అనూహ్య స్పందన లభించిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణకు బాండ్లకు అనూహ్య స్పందన

బ్రాండ్‌ ఇమేజ్‌కు మళ్లీ పూర్వ వైభవం: కేటీఆర్‌

 ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ఉటంకిస్తూ మంత్రి ట్వీట్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ బాండ్లకు అనూహ్య స్పందన లభించిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సోమవారం ఆర్‌బీఐ నిర్వహించిన వివిధ రాష్ట్రాల బాండ్ల వేలంలో తెలంగాణ బాండ్ల కొనుగోలుకు 287 సంస్థలు పోటీ పడ్డ విషయాన్ని ‘బ్రాండ్‌ ఇమేజ్‌ అదిరింది’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తను కోట్‌ చేస్తూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్నారు. 

Updated Date - 2020-04-15T08:55:08+05:30 IST