‘వృక్ష వేదం’తో ప్రజా చైతన్యం : కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-12-30T07:37:24+05:30 IST

పర్యావరణ ప్రేమికులు అడవుల పరిరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంత్రి కేటీఆర్‌కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని మంగళవారం

‘వృక్ష వేదం’తో ప్రజా చైతన్యం : కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ ప్రేమికులు అడవుల పరిరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంత్రి కేటీఆర్‌కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని మంగళవారం అందజేశారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అడవుల ప్రకృతి అందాల చిత్రాలు, వేదాలలో ప్రకృతి, వృక్షాల గురించి చెప్పిన విషయాలను విశ్లేషిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని ప్రచురించారు. 

Updated Date - 2020-12-30T07:37:24+05:30 IST