కృష్ణమ్మ శాంతించాలని పూజలు చేసిన ప్రజలు
ABN , First Publish Date - 2020-08-16T23:24:34+05:30 IST
జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడులో వరద ప్రవాహంతో పంటలకు నష్టం జరగకుండా ఉండాలని, కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ ప్రజలు పసుపు-కుంకుమతో పూజలు చేశారు.

కృష్ణా: జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడులో వరద ప్రవాహంతో పంటలకు నష్టం జరగకుండా ఉండాలని, కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ ప్రజలు పసుపు-కుంకుమతో పూజలు చేశారు. కాగా, ఇప్పటికే చందర్లపాడు మండలంలో వరద ప్రవాహానికి సుమారు 200 ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.