ఎఫ్‌జీజీ ఉపాధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి మృతి
ABN , First Publish Date - 2020-07-10T09:16:02+05:30 IST
ఎఫ్‌జీజీ ఉపాధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి మృతి

హైదరాబాద్, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) ఉపాధ్యక్షుడు ఎం.వెంకట కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మరణించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచికి చెందిన ఆయన ఏన్నో ఏళ్లుగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. గత 10 ఏళ్లుగా ఎఫ్‌జీజీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఐడీపీఎల్‌లో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే ప్రముఖ బిల్డర్, వ్యాపారవేత్తగా ఎదిగారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద కాలనీని ఆయనే ఏర్పాటు చేశారు. అనేక విద్యాలయాలు, వృద్ధాశ్రమాలకు చేయూత అందించారు. ఒంగోలులో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి రూ.20 లక్షల ఆర్థికసాయం చేశారు. వెంకటకృష్ణారెడ్డి మృతి ఎఫ్‌జీజీకి తీరని లోటని ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.