తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-06T04:14:18+05:30 IST

తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 283 కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు చెప్పారు. 32 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 283 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే కరోనా కేసులు 139కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌-10, భద్రాద్రి-3, జగిత్యాల-2, జనగాం-2, జయశంకర్‌-1, జోగులాంబ-5, కామారెడ్డి-8, కరీంనగర్‌-6, మహబూబాబాద్‌-1, మెదక్‌-5, మహబూబ్‌నగర్‌-3, మేడ్చల్‌-12, నాగర్‌కర్నూలు-2, నల్గొండ-13, నిర్మల్‌-1, నిజామాబాద్‌-19, పెద్దపల్లి-1, రంగారెడ్డి-11, సంగారెడ్డి-7, సిద్ధిపేట-1, సూర్యాపేట-2, వికారాబాద్‌-4, ములుగు-2, వరంగల్‌ అర్బన్‌-23 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-04-06T04:14:18+05:30 IST