మావోల కదలికలను గుర్తించాం.. : భద్రాద్రి ఎస్పీ

ABN , First Publish Date - 2020-10-03T23:46:01+05:30 IST

గత కొన్ని రోజులుగా భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ చేస్తున్న విషయం విదితమే.

మావోల కదలికలను గుర్తించాం.. : భద్రాద్రి ఎస్పీ

భద్రాద్రి : గత కొన్ని రోజులుగా భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ చేస్తున్న విషయం విదితమే. ఈ తరుణంలో పోలీసులకు మావోలు తారసపడటం ఇరువురి మధ్య కాల్పులు కూడా జరగడంతో ఒక నక్సలైట్ కూడా మరణించారు. ఆ తర్వాత మావోల కీలక నేత భాస్కర్‌తో పలువురు తప్పించుకున్నారని వారిని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటికీ భద్రాద్రి, చత్తీస్‌ఘడ్ బార్డర్‌లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మావోల కదలికలను గుర్తించామని భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు.


గుర్తించాం.. గాలిస్తున్నాం!

శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మావోయిస్టుల కదలికలను చత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లో గుర్తించామన్నారు. చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, ములుగు సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఈ గాలింపులో చత్తీస్‌ఘడ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూడా భాగమయ్యాయని.. అడవిలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నామని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.

Updated Date - 2020-10-03T23:46:01+05:30 IST