జూనియర్‌ కాలేజీలుగా మైనారిటీ గురుకులాలు

ABN , First Publish Date - 2020-09-17T07:47:53+05:30 IST

జూనియర్‌ కాలేజీలుగా మైనారిటీ గురుకులాలు

జూనియర్‌ కాలేజీలుగా మైనారిటీ గురుకులాలు

త్వరలో డిగ్రీ కాలేజీల ప్రారంభం: కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16(ఆంధ్రజ్యోతి): కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా 71 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఈ ఏడాది నుంచి జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మైనారిటీ డిగ్రీ కళాశాలలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. శాసన మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ ప్రశ్నకు కొప్పుల సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 840 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని  చెప్పారు. వీటిలో 4,29,668 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలో రూ.20 కోట్లతో అనీ్‌స-ఉల్‌-గుర్భా అనాథాశ్రమాన్ని నిర్మిస్తున్నామని, దీనికి రూ.11.41 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అందులో 600 మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తామని, దీన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభిస్తామన్నారు.   

Updated Date - 2020-09-17T07:47:53+05:30 IST