హైదరాబాద్ కొండాపూర్ ఆస్పత్రిలో 14 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-06-17T00:16:17+05:30 IST

నగరంలో కరోనా విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు.. చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ..

హైదరాబాద్ కొండాపూర్ ఆస్పత్రిలో 14 మందికి కరోనా

హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు.. చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతోంది. తాజాగా గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో 10 మంది వైద్య సిబ్బంది‌తో పాటు హాస్పిటల్‌కి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో మొత్తం 14 కరోనా కేసులు నమోదు కావడంతో ఆస్పత్రి వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విధులు నిర్వహించేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో పని చేసే వైద్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రితోపాటు పరిసరాల్లోనూ క్రిమిసంహారక మందు పిచికారి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-17T00:16:17+05:30 IST