భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-05-08T22:02:42+05:30 IST

కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజ్ఞాపూర్‌లో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.

భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్: ఉత్తమ్

సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజ్ఞాపూర్‌లో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. భూ నిర్వాసితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలపై ప్రభుత్వం చేస్తున్న భయానక చర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-08T22:02:42+05:30 IST