కేసీఆర్‌ను ప్రశ్నించిన విశ్వేశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-11T20:58:22+05:30 IST

సీఎం కేసీఆర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణానీటిని తరలిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని నిలదీశారు. రంగారెడ్డి జిల్లాకు నీటిని 2 టీఎంసీల

కేసీఆర్‌ను ప్రశ్నించిన విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణానీటిని తరలిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని నిలదీశారు. రంగారెడ్డి జిల్లాకు నీటిని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా.. కేసీఆర్ మాట్లాడటం లేదని, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా నీటి తరలింపును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వికారాబాద్, రంగారెడ్డికి నీరిచ్చే పనులు ప్రారంభించాలని విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు.

Updated Date - 2020-05-11T20:58:22+05:30 IST