కొమురం భీం జిల్లా ప్రజలకు వణుకు పుట్టిస్తున్న పులి

ABN , First Publish Date - 2020-12-03T14:24:15+05:30 IST

సరిహద్దులో చిరుత పులి సంచరిస్తోంది. ఇంతకుముందు మహారాష్ట్రలో పంజా విసిరిన పులి ఇప్పుడు చంద్రాపూర్ జిల్లాలోని ప్రజలకు నిద్రపట్టకుండా ...

కొమురం భీం జిల్లా ప్రజలకు వణుకు పుట్టిస్తున్న పులి

కొమురం భీం : జిల్లా సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తోంది. ఇంతకుముందు మహారాష్ట్రలో పంజా విసిరిన పులి ఇప్పుడు చంద్రాపూర్ జిల్లాలోని ప్రజలకు నిద్రపట్టకుండా వణుకుపుట్టిస్తోంది. చంద్రపూర్ జిల్లాలో పశువుల కాపరిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు కొమురం భీం జిల్లా  ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇటీవల పులి దాడిలో పశువుల కాపరి సుజత్(18) ప్రాణాలు కోల్పోయాడు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కొమురంభీం జిల్లాలో ప్రజలందరు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు. బయటకు వెళ్లితే 8 మందికి తగ్గకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని, శబ్దాలు చేస్తూ వెళ్లాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. పులిని పట్టుకోవడానికి ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడించారు.

Updated Date - 2020-12-03T14:24:15+05:30 IST