పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పనిచేస్తా: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-12T19:24:53+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పనిచేస్తా: కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించానని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణపై సోనియాతో చర్చించానన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న వ్యక్తిని... తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడాన్ని సోనియాకు వివరించానన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పనిచేసే కార్యకర్తలతో నూతన టీమ్‌ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా ఉంటూ... అంచెలంచెలుగా ఎదిగానన్నారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-12T19:24:53+05:30 IST