మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-17T00:09:06+05:30 IST

మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు రాలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను వాడుకున్నది ఎవరని ప్రశ్నించారు.

మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు రాలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను వాడుకున్నది ఎవరని ప్రశ్నించారు. ఉద్యోగాలు, ఇళ్లు, పేదలకు భూమి హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని, తమ హయాంలో కట్టిన ఇళ్లను కూడా మీ ఖాతాలో వేసుకున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఇదే అసెంబ్లీలో కాంగ్రెస్ నేత సోనియాను సీఎం కేసీఆర్‌ దేవత అన్నారని, ఇప్పుడు కరోనాతో పోల్చారని మండిపడ్డారు. ఎవరు మాట మార్చేది...ఎవరు జోకర్...మీరా..మేమా అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘నేను సభలో లేనప్పుడు నన్ను జోకర్ అని ఒక మంత్రి మాట్లాడుతున్నారు. మంత్రి అలా మాట్లాడొచ్చా. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-17T00:09:06+05:30 IST