ఎల్‌ఆర్ఎస్‌ను పూర్తిగా రద్దు చేసే వరకూ పోరాటం: కోమటి రెడ్డి
ABN , First Publish Date - 2020-12-30T19:23:29+05:30 IST
హైదరాబాద్: ఎల్‌ఆర్ఎస్‌ను పూర్తిగా రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: ఎల్‌ఆర్ఎస్‌ను పూర్తిగా రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు కోసం ప్రజల పక్షాన హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు అంటూ మరో మోసానికి కేసీఆర్ తెరలేపారన్నారు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలన్నారు. లేకుంటే ప్రజలే కేసీఆర్‌ను.. టీఆర్ఎస్ పార్టీనీ రద్దు చేస్తారని ఎంపీ కోమటి రెడ్డి పేర్కొన్నారు.