టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి?

ABN , First Publish Date - 2020-12-11T15:48:30+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి కోసం తీవ్ర పోటీ నెలకొంది.

టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారధి కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్‌‌తో నేతల చర్చలతో పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తి పెరిగింది. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డి బలంగా కోరుతున్నారు. ఇందులో భాగంగా ఠాగూర్‌తో చర్చలు జరపడంతో వెంకట రెడ్డికి పదవి గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది.


గాంధీభవన్‌లో పార్టీ నేతలతో ఠాగూర్ చర్చల జోరు పెంచారు. నేతలతో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి నివేదిక సమర్పించనున్నారు. అయితే నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఠాగూర్ చర్చలు జరిపారు. గంటపాటు జరిగిన చర్చల్లో వెంకట్ రెడ్డి.. తనకు పదవి ఎందుకు ఇవ్వాలో ఠాగూర్‌కు వివరించారు.


కాంగ్రెస్‌లో పదవి కోసం పోటీపడుతున్న వారిలో వెంకట్ రెడ్డిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే నిన్న వెంకట్ రెడ్డి, ఠాగూర్‌తో భేటీ అవడం చర్చనీయాంశమైంది. ఆయనతో జరిపిన చర్చల్లో తనకు పదవి ఇస్తే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళతానో ఠాగూర్‌కు చెప్పానన్నారు. టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా జనంలోకి వెళతాన్నారు. ప్రభుత్వ విధానాలు ఎండగట్టి కాంగ్రెస్ ద్వారా ప్రజలకు భరోసా కల్పించే పని చేస్తాన్నారు. పార్టీలో అందరినీ సంగటితం చేస్తానన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితి గురించి చెప్పానన్నారు.

Updated Date - 2020-12-11T15:48:30+05:30 IST