కొమురం భీం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-19T02:42:38+05:30 IST
కొమురం భీం జిల్లాలో పెరిగిన కరోనా కేసులు

కొమురం భీం జిల్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొమురం భీం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దహెగాం మండలం మొట్టగూడ చౌకి గ్రామాలకు చెందిన ఇద్దరూ పంచాయతీ కార్యదర్శులకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.