పంటలపై వడగండ్లు !

ABN , First Publish Date - 2020-03-13T10:55:08+05:30 IST

జగిత్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో గురువారం కురిసిన వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న, నువ్వు, జొన్న పంటలు నేలమట్టం అయ్యాయి.

పంటలపై వడగండ్లు !

జగిత్యాల/ఆసిఫాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల,  కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో గురువారం కురిసిన వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న, నువ్వు, జొన్న పంటలు నేలమట్టం అయ్యాయి. అమ్మకానికి తెచ్చిన పసుపు  మార్కె ట్‌ యార్డులోనే తడిసిపోయింది. జగిత్యాల మం డలం మోరపెల్లి, చల్‌గల్‌, తాటిపెల్లి గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలు నేలమట్టమయ్యాయి. వారం, పది రోజుల్లో కోతకు వస్తుందనుకున్న మొక్కజొన్న పంట నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, రాయికల్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెట్‌పల్లి మార్కెట్‌ యార్డులో అమ్మకానికి తెచ్చిన పసుపు పంట పూర్తిగా తడిసిపోయింది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. ఇందిరా నగర్‌ కాలనీలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. 

Updated Date - 2020-03-13T10:55:08+05:30 IST