కొమురం భీంలో టైగర్‌ ఆపరేషన్‌-2కు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-12-27T19:29:57+05:30 IST

కొమురం భీం జిల్లాలో టైగర్‌ ఆపరేషన్‌-2కు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కొమురం భీంలో టైగర్‌ ఆపరేషన్‌-2కు రంగం సిద్ధం

కొమురం భీం: జిల్లాలో టైగర్‌ ఆపరేషన్‌-2కు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మనుషులను చంపుతున్న పులులను పట్టుకోడానికి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. బోన్లలో బంధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఇక మత్తుమందు ప్రయోగించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే నాలుగు ట్రాంక్యులైజ్ గన్‌లు, ప్రత్యేక సిబ్బందిని సిద్ధం చేశారు. ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తాజా ఆపరేషన్ చేపట్టనున్నారు.

Updated Date - 2020-12-27T19:29:57+05:30 IST