కోయిల్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2020-08-17T01:41:57+05:30 IST
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని దేవరకద్ర

మహబూబ్ నగర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల కోయిల్ సాగర్ ప్రాజెక్టు కృష్ణమ్మ పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేశారు. 1000 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న ఉక్క చెట్టు వాగులోకి వదిలారు.