బూడిదలో పోసిన పన్నీరైంది: కోదండరాం

ABN , First Publish Date - 2020-03-02T10:21:52+05:30 IST

నాలుగేళ్ల పాటు టీజేఏసీగా తాము పడిన శ్రమ.. బూడిదలో పోసిన పన్నీరయిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసమే టీజేఎస్‌

బూడిదలో పోసిన పన్నీరైంది: కోదండరాం

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల పాటు టీజేఏసీగా తాము పడిన శ్రమ.. బూడిదలో పోసిన పన్నీరయిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసమే టీజేఎస్‌ ఆవిర్భవించిందని, ఇబ్బందులన్నీ అధిగమించి పార్టీ బలపడుతోందని చెప్పారు. ఆదివారం టీజేఎస్‌ కార్యాలయంలో గురు రవిదాస్‌ మహారాజ్‌ 643వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు కోదండరాం సమక్షంలో టీజేఎ్‌సలో చేరారు. 

Updated Date - 2020-03-02T10:21:52+05:30 IST