‘తెలంగాణను కాపాడాలి’ నినాదంతో..కోదండరాం 48 గంటల నిరశన

ABN , First Publish Date - 2020-12-30T07:42:48+05:30 IST

‘‘రైతుల పంటను కొనే విషయంలో ప్రభుత్వం వింత వాదన చేస్తోంది. పంట కొనేందుకు ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా అని కేసీఆర్‌ అంటున్నారు

‘తెలంగాణను కాపాడాలి’ నినాదంతో..కోదండరాం 48 గంటల నిరశన

‘‘రైతుల పంటను కొనే విషయంలో ప్రభుత్వం వింత వాదన చేస్తోంది. పంట కొనేందుకు ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా అని కేసీఆర్‌ అంటున్నారు. కొంత మంది వ్యాపారస్తులకు భూమి కొని ఇస్తున్నారు కదా? అప్పుడు వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులా?’’ అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని, రైతు వ్యతిరేక సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు జరుపబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ‘బతుకు దెరువును నిలబెట్టాలి.. తెలంగాణను కాపాడాలి’ అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటలపాటు నిరశన చేయనున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2020-12-30T07:42:48+05:30 IST