తెలంగాణను కాపాడాలి అన్న నినాదంతో 48 గంటల నిరశన: కోదండరాం

ABN , First Publish Date - 2020-12-30T08:33:37+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని, రైతు వ్యతిరేక సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు జరుపబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు

తెలంగాణను కాపాడాలి అన్న నినాదంతో 48 గంటల నిరశన: కోదండరాం

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని, రైతు వ్యతిరేక సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు జరుపబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ‘బతుకు దెరువును నిలబెట్టాలి.. తెలంగాణను కాపాడాలి’ అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరశన చేయనున్నట్లు ప్రకటించారు. నాంపల్లిలోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇది ప్రారంభమేనని మున్ముందు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ దీక్షకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాలు, నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం ప్రముఖులు సహకరించి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-12-30T08:33:37+05:30 IST