సీపీఐ మద్దతు కోరిన కోదండరామ్
ABN , First Publish Date - 2020-10-04T08:17:02+05:30 IST
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో పోటీ ..
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని కోరారు. ఈ నెల 6న జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చాడ ఆయనకు చెప్పినట్లు తెలిసింది.