రైతుబంధు సర్వరోగ నివారిణి కాదు: కోదండరెడ్డి
ABN , First Publish Date - 2020-03-13T09:07:02+05:30 IST
‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతు, వ్యవసాయ అంశాలపై మంత్రి హరీశ్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.

హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతు, వ్యవసాయ అంశాలపై మంత్రి హరీశ్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. నీలం తుపాను వచ్చినప్పుడు హెక్టారుకు 10వేల చొప్పున అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం చెల్లించిందన్నారు.