కేఎల్‌ఐ పంప్‌హౌ్‌సలో.. రెండ్రోజుల్లో నీటి తోడివేత పూర్తి

ABN , First Publish Date - 2020-10-27T09:10:40+05:30 IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) ప్రాజెక్టు మొదటి లిఫ్టు పంప్‌ హౌస్‌లో చేరిన వరద నీరు తగ్గుముఖం పడుతోంది. మొత్తం 51

కేఎల్‌ఐ పంప్‌హౌ్‌సలో.. రెండ్రోజుల్లో నీటి తోడివేత పూర్తి

క్రమంగా బయటపడుతున్న మోటార్లు


కొల్లాపూర్‌, అక్టోబరు 26 : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) ప్రాజెక్టు మొదటి లిఫ్టు పంప్‌ హౌస్‌లో చేరిన వరద నీరు తగ్గుముఖం పడుతోంది. మొత్తం 51 మీటర్ల వరకు నీరు చేరగా.. సోమవారం నాటికి 35 మీటర్ల వరకు తోడివేశారు. 40 హెచ్‌పీ మోటార్లు రెండు, 60 హెచ్‌పీ మోటారు ఒకటి, 75 హెచ్‌పీ సామర్థ్యం గల మోటారు ఒకటి ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం నీటిని తోడి వేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మోటార్లను పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. ప్రస్తుతం పంప్‌ హౌస్‌లో మోటార్ల పై భాగం కనిపిస్తోంది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో డ్రమ్ముల్లో ఉన్న ఆయిల్‌ బయటపడి తోడివేత నెమ్మదిగా సాగుతోంది.

Updated Date - 2020-10-27T09:10:40+05:30 IST