కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-12-29T22:26:21+05:30 IST
కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్‌లో కిష్టరాంపల్లి భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
నల్లగొండ : కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో గత ఆరేళ్లుగా రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారన్నారు. కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులను పెట్టి పనిచేయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాళేశ్వరానికి ఓ న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఓ న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరాహారదీక్ష చేసైనా సరే సీఎం కళ్లు తెరిపిస్తామని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టు విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.