ఉదార సాయం చేస్తున్నాం.. కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-03-15T19:12:05+05:30 IST

తెలంగాణలో కందుల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం 51,626 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసిందని...

ఉదార సాయం చేస్తున్నాం.. కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కందుల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం 51,626 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టన్ను కూడా కొనుగోలు చేయలేదన్నారు. రైతులు కందులను దళారీలకు అమ్ముకుని నష్టపోయారని చెప్పారు. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. 20లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేసిందని తెలిపారు. కేంద్రంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని..తెలంగాణకు ఉదార సాయం చేస్తున్నామని చెప్పారు. కరోనా నివారణకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 





Updated Date - 2020-03-15T19:12:05+05:30 IST