కిషన్ రెడ్డి పిలుపుతో రక్తదాన శిబిరం ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-10T22:24:43+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు జూబ్లీహిల్స్‌లో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానం చేశారు.

కిషన్ రెడ్డి పిలుపుతో రక్తదాన శిబిరం ఏర్పాటు

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు జూబ్లీహిల్స్‌లో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పలు ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. దీంతో తలసీమియా పేషెంట్స్ రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి రక్తదానానికి పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, మరికొందరు కూడా రక్తదానం చేయాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-10T22:24:43+05:30 IST