కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

ABN , First Publish Date - 2020-10-19T21:20:02+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు మాత్రం ప్రగతిభవన్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు... ఇప్పుడు రాజకీయాలు

కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు మాత్రం ప్రగతిభవన్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు... ఇప్పుడు రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. కేంద్ర బృందాలు కూడా తెలంగాణలో పర్యటించి నివేదిక ఇస్తాయని వెల్లడించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T21:20:02+05:30 IST