ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-08-01T15:57:12+05:30 IST
హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసతులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో అందుతోన్న వైద్యం, వసతులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టిమ్స్‌లో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలన్నారు. కరోనాను కట్టడి చేస్తోన్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందికి జీతాలతో పాటు.. అదనంగా ఇన్సెటివ్స్ అందించాలన్నారు. కరోనా బారినపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలు కావొద్దని కిషన్‌రెడ్డి సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
నన్నారు. బయట తిరుగుతోన్న హోమ్ ఐసోలేషన్‌లో పేషెంట్స్‌ను ప్రభుత్వం గుర్తించాలన్నారు.
అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు గడప దాటి బయటకు రావొద్దని సూచించారు.
ఆగస్టు నెలలో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.