కేసీఆర్ 15రోజులు ఉండేది అక్కడే కదా?: కిషన్‌రెడ్డి విమర్శ

ABN , First Publish Date - 2020-11-07T03:23:41+05:30 IST

వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్ 15రోజులు ఉండేది అక్కడే కదా?: కిషన్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ  బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనారిటీ మహిళలతో పాటు భారీగా యువత బీజేపీలో చేరింది.


అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్రంలో కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్, సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ. మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం నెలకు 15 రోజులు ఫాంహౌస్‌లోనే ఉంటారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధాకరం. ఫాంహౌస్‌కు వెళ్లడానికి మాత్రం కేసీఆర్‌కు సమయం ఉంటుంది. డబుల్ బెడ్రూం  ఇళ్లు ఇస్తామని జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మైనార్టీలు బీజేపీతోనే ఉన్నారు..  మైనార్టీలకు 100 శాతం బీజేపీ న్యాయం చేస్తుంది’ అని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-07T03:23:41+05:30 IST