చలో ప్రగతిభవన్‌కు కిసాన్ కాంగ్రెస్ పిలుపు

ABN , First Publish Date - 2020-09-18T04:16:33+05:30 IST

చలో ప్రగతిభవన్‌కు కిసాన్ కాంగ్రెస్ పిలుపు

చలో ప్రగతిభవన్‌కు కిసాన్ కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్: కిసాన్ కాంగ్రెస్ శుక్రవారం చలో ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చింది. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కిసాన్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సూచించారు. సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు కోరారు. 

Updated Date - 2020-09-18T04:16:33+05:30 IST