క్లౌడ్‌ సేవల కింగ్‌..

ABN , First Publish Date - 2020-11-07T07:06:28+05:30 IST

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి.. అంటూ ఒకటే హడావుడి! ఏమిటీ వెబ్‌ సర్వీసెస్‌? అది ఏయే సేవలందిస్తుంది? కొత్తగా వచ్చే ఉద్యోగాల

క్లౌడ్‌ సేవల కింగ్‌..

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌

జెఫ్‌బెజోస్‌కు వచ్చిన ఆలోచనకు రూపం

2006 నాటికే ఏడబ్ల్యూఎస్‌ అందుబాటులోకి

ప్రఖ్యాత సంస్థలన్నింటకీ ఏడబ్ల్యూఎస్‌ సేవలు

 

 మనందరం ‘నెట్‌ఫ్లిక్స్‌’ వంటి ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) సర్వీసుల్లో సినిమాలు చూస్తాం. రిమోట్‌లో ఒక్క బటన్‌ నొక్కగానే నెట్‌ఫ్లిక్స్‌లోని సినిమా ప్రపంచం మొత్తం మన కళ్లముందుంటుంది. ఏది కావాలంటే దాన్ని ఎంచుకుని ప్లే నొక్కడమే తరువాయి. ఆ సినిమా/డాక్యుమెంటరీ/వెబ్‌ సిరీస్‌ను చూసేయొచ్చు. కానీ ఇదంతా ఎలా సాధ్యం? వేలాది సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఏ సర్వర్లలో భద్రపరుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే వెబ్‌ సర్వీసెస్‌. అమెజాన్‌ సంస్థ ప్రారంభించిన ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ‘ఇంతింతై డేటా ఇంతై..’ అన్నట్టుగా ఎదుగుతూ ఇప్పుడు విశ్వరూపం దాల్చింది. ఇదేదో మాటవరసకు అన్నమాట కాదు. నిజంగానే.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల కోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌నే ఆశ్రయిస్తున్నాయి.


అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి.. అంటూ ఒకటే హడావుడి! ఏమిటీ వెబ్‌ సర్వీసెస్‌? అది ఏయే సేవలందిస్తుంది? కొత్తగా వచ్చే ఉద్యోగాల సంగతి పక్కన పెడితే.. దానివల్ల సామాన్యులకు ప్రయోజనమేంటి? అంటే.. ఒకటి కాదు, చాలా ప్రయోజనాలున్నాయి. మన నిత్యజీవితంలో మనకు తెలియకుండానే మనం ఉపయోగించే అనేక వినోద సాధనాల వెనుక, ఉపయోగపడే సేవల వెనుక అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలే కీలకం. వెబ్‌ సర్వీసెస్‌.. అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే చాలామందికి అర్థమవుతుంది. వెబ్‌ సర్వీసెస్‌ పేరుతో అమెజాన్‌ అందించే సేవ అదే. అర్థమయ్యేలా చెప్పాలంటే.. మీ ఫోన్‌లో గూగుల్‌ ఫొటోస్‌  యాప్‌, గూగుల్‌ డ్రైవ్‌ ఉన్నాయి కదా. వాటిలో గూగుల్‌ సంస్థ మనకు 15 జీబీ దాకా స్టోరేజీని ఉచితంగా ఇస్తోంది. వాటిలో ఫోటోలు, డాక్యుమెంట్లు.. ఇలా ఏవైనా మనం దాచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌లో ఉన్న మొబైల్‌ డేటా ద్వారా లేదా వైఫై ద్వారా ఇంటర్‌నెట్‌కు కనెక్ట్‌ అయ్యి ఆ ఫొటోలను, డాక్యుమెంట్లను చూసుకోవచ్చు. అలా మన సమాచారాన్ని గూగుల్‌ డ్రైవ్‌ వంటివాటిలో దాచుకొని, అవసరమైనప్పుడు తీసి వాడుకోవడాన్నే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటారు.


వ్యక్తిగత స్థాయిలో మనకు పెద్ద డేటా ఉండదు కాబట్టి ఆ డేటా సరిపోతుంది. అదే సంస్థల స్థాయిలో అయితే.. పెద్ద ఎత్తున డేటా దాచుకోవడానికి భారీస్థాయి సర్వర్లు అవసరమవుతాయి. వాటి నిర్వహణకు మరింత ఖర్చు అవసరం అవుతుంది. ఆ అవసరం లేకుండా సంస్థలు తమ సమాచారాన్ని దాచుకోవడానికి, రిమోట్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన బ్యాంకులాంటిదే వెబ్‌ సర్వీసెస్‌. అంటే ఎవరైనా ఈ సేవలను ఉపయోగించుకుని తమ సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలు చేస్తున్నది ఇదే.


ఒక్క నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ అనేమిటి.. అడోబ్‌, ఎయిర్‌బీఎన్‌బీ వంటివి కూడా ఏడబ్ల్యూఎస్‌ సేవలను పొందుతున్నాయి. కేవలం ఇలాంటి స్టోరేజీ సేవలనే కాదు.. సాఫ్ట్‌వేర్‌ సేవలను, డేటాబేస్‌ సేవలను, ఎనలిటిక్స్‌, నెట్‌వర్కింగ్‌, మొబైల్‌, డెవలపర్‌ టూల్స్‌, మేనేజ్‌మెంట్‌ టూల్స్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలను కూడా ఏడబ్ల్యూఎస్‌ అందిస్తుంది. ఇలాంటి సేవలనే మైక్రోసాఫ్ట్‌ (అజూర్‌), గూగుల్‌ (గూగుల్‌ క్లౌడ్‌), అలీబాబా (అలీబాబా క్లౌడ్‌), ఐబీఎం (ఐబీఎం క్లౌడ్‌) వంటివి కూడా అందిస్తున్నాయి. కానీ, అగ్రగామి మాత్రం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెసే.  




ఇలా మొదలు..

అమెజాన్‌ను స్థాపించిన జెఫ్‌ బెజోస్‌ ఈ వెబ్‌ సర్వీసెస్‌ ఆలోచనకు మూలకారకుడు. ఏడబ్ల్యూఎస్‌ ప్రస్తుత రూపానికి రాకముందు మిగతా అన్ని వెబ్‌సైట్లలాగా ‘అమెజాన్‌ బ్యాక్‌ ఎండ్‌ టెక్నాలజీ’గా మాత్రమే ఉండేది. అంటే ప్రతి కంపెనీ తన వెబ్‌సర్వర్లను నడిపినట్టుగానే అమెజాన్‌ సొంత సర్వర్లతో పనిచేసుకునేది.

ఒకసారి బెజో్‌సకు ఒక ఆలోచన వచ్చింది.తన సంస్థలోని యాడ్స్‌ విభాగం సేల్స్‌ గణాంకాలను ఆ విభాగం వారిని అడిగి, ఈమెయిల్‌ ద్వారా తెప్పించుకోవడం కన్నా.. సెంట్రల్‌ డేటా నుంచి తీసుకునేలా ఏర్పాటు చేయాలన్నది ఆ ఆలోచన. ఆ తర్వాత.. అది కేవలం తమ అంతర్గత అవసరాలకే కాకుండా, బోలెడన్ని కంపెనీలకూ ఉపయోగపడేలా ఉంటే? అన్న ఆలోచన వచ్చింది. అదే అమెజాన్‌ వెబ్‌ సర్వీసె్‌సకు మూలం.


2002లో జూలైలో అలా ఏడబ్ల్యూఎస్‌ మొదలైంది. 2006 నుంచి బయటి ప్రపంచానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసె్‌సలోకి దారులు తెరుచుకున్నాయి. సాంకేతికంగా ఆలోచిస్తే.. అమెజాన్‌ వెబ్‌సైట్‌ చేస్తున్న పని కూడా అదే. ఎవరి కంపెనీ కోసం వారు వెబ్‌సైట్‌ రూపొందించుకోవడం కాకుండా.. అందరు రిటైలర్లూ వచ్చి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వస్తువులను అమ్ముకుంటున్నారు. అక్కడ భౌతికంగా కనపడే వస్తువులను అమ్మితే.. వెబ్‌ సర్వీసె్‌సలో సేవలను అమ్ముతారంతే.




పెద్ద తతంగం..

ప్రారంభించిన మొదట్లో ఏడబ్ల్యూఎస్‌ అంటే కేవలం అమెజాన్‌ కంప్యూటర్లలో కొంత స్థలాన్ని కొనుక్కోవడం మాత్రమే. కానీ, కాలక్రమంలో ఏడబ్ల్యూఎస్‌ నాలుగు సేవలను అందించడం ప్రారంభించింది. అవి.. స్టోరేజ్‌, కంప్యూటింగ్‌, డేటాబేస్‌, ఇంటర్నల్‌ మెసేజింగ్‌. వీటిలో మొదటి రెండింటినీ ‘అమెజాన్‌ ఎస్‌3’గా వ్యవహరిస్తారు.


అంటే సింపుల్‌ స్టోరేజ్‌ సర్వీస్‌. నిజానికి ఏడబ్ల్యూఎస్‌ రాకముందు ఇలా చేయాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. తగిన సర్వీస్‌ ప్రొవైడర్‌ను వెతుక్కోవడం, మన సేవలకు అవసరమయ్యే స్పెసిఫికేషన్లు ఉన్న సర్వర్లను ఎంచుకోవడం.. ఇదంతా కష్టంగా ఉండేది. అమెజాన్‌ వాటన్నింటినీ సులభతరం చేసింది. 2016 నాటికి దాదాపు 13 లక్షల సర్వర్లను ఉపయోగించి అమెజాన్‌ తన వెబ్‌ సర్వీసె్‌సను అందించేది. ఆ తర్వాత సర్వర్ల సంఖ్య ఇంకా పెరిగింది. వాటి ద్వారా దాదాపు 190 దేశాల్లో కొన్ని లక్షల మంది ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. 




ప్రముఖ కంపెనీలన్నీ..

అశోక్‌ లేలాండ్‌, ఆదిత్య బిర్లా కేపిటల్‌, యాక్సిస్‌ బ్యాంకు, క్లియర్‌ ట్యాక్స్‌, హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌, మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఓలా, ఓయో, నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేజీ ఈ-మార్కెట్స్‌ లిమిటెడ్‌ వంటి అనేక కంపెనీలు ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. తమ కీలకమైన వర్క్‌, డేటాను క్లౌడ్‌ ఫ్లాట్‌ఫారమ్‌కు తరలిస్తున్నాయి. నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజీ 50 అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌కు బదిలీ చేసింది. హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ సైతం కీలకమైన అప్లికేషన్లను ఏడబ్ల్యూఎ్‌సకు బదలీ చేసింది.


డీఎ్‌సపీ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్స్‌ గత ఏడాది 50 అప్లికేషన్లను ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ ద్వారా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యప్‌ టీవీ ఓవర్‌-ద-టాప్‌ (ఓటీటీ) సేవలకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సేవలను ఎంచుకుంది.  దేశంలోని అనేక స్టార్ట్‌పలు, చిన్న, మఽఽధ్య స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలు, ఎన్‌జీఓలు ఏడబ్ల్యూఎస్‌ ఖాతాదారులుగా ఉన్నాయి.


Updated Date - 2020-11-07T07:06:28+05:30 IST