నూతలపాటికి కిమ్స్ ఫెలోషిప్ అవార్డు
ABN , First Publish Date - 2020-12-06T07:49:04+05:30 IST
అతి తక్కువ మంది డాక్టర్లు మాత్రమే స్పెషలైజ్డ్ కోర్సుల్లో ప్రతిభ చూపుతారని.. తల, మెడ

‘హెడ్, నెక్ ఆంకాలజీ’లో అద్భుత ప్రతిభకు గుర్తింపు
అభినందించిన కిమ్స్ ఎండీ డాక్టర్ బి భాస్కర్‌రావు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అతి తక్కువ మంది డాక్టర్లు మాత్రమే స్పెషలైజ్డ్ కోర్సుల్లో ప్రతిభ చూపుతారని.. తల, మెడ ఆంకాలజీ విభాగంలో డాక్టర్ నూతలపాటి రవిశంకర్ అద్భుత ప్రతిభను చూపారని కిమ్స్ ఆస్పత్రుల ఎండీ డాక్టర్ బి. భాస్కర్‌రావు ప్రశంసించారు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్స్ ఫెలోషిప్ అవార్డును రవిశంకర్‌కు ఆయన ప్రదానం చేశారు.
కిమ్స్ సికింద్రాబాద్ శాఖ లో సేవలందించే హెడ్, నెక్ ఆంకాలజీ నిపుణులు పర్వతనేని నాగేంద్ర ఆధ్వర్యంలో రెండేళ్ల ఫెలోషి్‌పను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ రవిశంకర్‌ను భాస్కర్‌రావు అభినందించారు. ప్రతి రోగి కూడా ప్రత్యేకమని.. వారికి చికిత్స అందించిన కొద్దీ డాక్టర్ అనుభవం ఇనుమడిస్తుందని ఆయన అన్నారు. డాక్టర్లు చనిపోయేవరకు ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటూనే ఉంటారన్నారు. తల, మెడ శస్త్ర చికిత్సలు ఎంతో క్లిష్టమైనవి, కీలకమైనవని చెప్పారు. ఈ విభాగంలో ఎంతో ప్రతిభ చూపిన డాక్టర్ రవిశంకర్‌కు మున్ముందు ఎంతో భవిష్యత్తు, గౌరవం లభిస్తాయన్నారు. శస్త్ర చికిత్స చేయడానికి ముందే రోగి గురించి పూర్తి వివరాలను సేకరించి, చికిత్స ప్రారంభించాలన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ సికింద్రాబాద్ శాఖ హెడ్, నెక్ ఆంకాలజీ నిపుణులు పర్వతనేని నాగేంద్ర మాట్లాడుతూ.. హెడ్, నెక్ ఆంకాలజీలో తక్కువ సమయంలోనే రవిశంకర్ మంచి పరిణతిని ప్రదర్శించారని తెలిపారు. కిమ్స్ ఆస్పత్రుల సీఈవో డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ కిమ్స్ ఆస్పత్రుల్లో హెడ్, నెక్ ఆంకాలజీ విభాగంలో అద్భుతమైన డాక్టర్ల బృందం ఉందని, వారందరికీ అభినందనలు తెలిపారు.
ఫెలోషిప్ అవార్డు అందుకున్న డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎంతో నేర్చుకున్నానని, మరింతకాలం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్ డాక్టర్లు రమేష్, కృష్ణ, సతీష్, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.