సవతి పిల్లల్ని చంపి.. తానూ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T08:12:29+05:30 IST

రెండో పెళ్లి చేసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్తపై ఉన్న కోపంతో తన సవతి పిల్లలు ఇద్దరిని చంపేసి.. తానూ ఆత్మహత్య

సవతి పిల్లల్ని చంపి.. తానూ ఆత్మహత్య

  రెండో భార్యతోనే భర్త ఉంటున్నాడని కసితో మహిళ దారుణం

 నల్లగొండ క్రైం, డిసెంబరు 10:   రెండో పెళ్లి చేసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్తపై ఉన్న కోపంతో తన సవతి పిల్లలు ఇద్దరిని చంపేసి.. తానూ ఆత్మహత్య చేసుకుందో మహిళ. నల్లగొండలో గురువారం రాత్రి జరిగింది. సూర్యాపేటకు చెందిన మేకల ప్రదీప్‌.. 20 ఏళ్ల క్రితం నల్లగొండకు వచ్చి స్థిరపడ్డాడు. దుప్పెల్లికి చెందిన ప్రసన్నరాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ప్రదీప్‌ ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండకు చెందిన శాంతమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. వారి కాపురంలో కలతలు రేగాయి. ప్రదీప్‌ రెండో భార్య శాంతమ్మతోనే ఉండేవాడు. శాంతమ్మ.. మిర్యాలగూడ రోడ్డులోని బీటీఎ్‌సలో ఉంటూ నల్లగొండ ఐసీడీఎస్‌ కార్యాలయంలో పనిచేస్తోంది. ఆమెకు మేధశ్రీ (7), రుచిర (4) కుమార్తెలు. ఈ క్రమంలో మొదటి భార్య ప్రసన్నరాణి (45).. ప్రదీ్‌పతో రాజీకి వచ్చింది. నెల రోజుల క్రితం అందరూ ఒక్కటై కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, తన భర్త.. రెండో భార్యతోనే ఎక్కువగా గడుపుతుండడాన్ని ప్రసన్నరాణి సహించలేకపోయేది. భర్త, తన సవతి పిల్లలపై కసి పెంచుకుంది.


గురువారం ప్రసన్నరాణి, ప్రదీ్‌పల వివాహ దినోత్సవం. ఇదే రోజు భర్త ప్రదీప్‌, పెద్ద కుమార్తె రుచిత.. ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. తన స్కూటీపై బీటీఎ్‌సకు వెళ్లి సవతి పిల్లలైన మేధశ్రీ, రుచిరలను తన నివాసానికి తీసుకెళ్లింది. వారి మెడలకు సన్న తాళ్లను బిగించి దారుణంగా హత్య చేసింది. అనంతరం తాను ఫ్యానుకు ఉరేసుకుని ఉసురు తీసుకుంది. 


Updated Date - 2020-12-11T08:12:29+05:30 IST