కేసీఆర్ సారూ.. మమ్మల్ని జర ఆదుకోరూ!
ABN , First Publish Date - 2020-04-05T08:24:13+05:30 IST
పొట్టకూటి కోసం జార్ఖండ్‌కు వలస వెళ్లిన కూలీలు కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెకు...
- జార్ఖండ్ నుంచి వాట్సాప్‌లో ఖానాపూర్ వాసులు
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 4: పొట్టకూటి కోసం జార్ఖండ్‌కు వలస వెళ్లిన కూలీలు కరోనా లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లెకు చెందిన గందం గంగన్న, గందం శ్రీనివాస్, లచ్చన్న, ఈబూది గంగన్న, ఎల్లవ్వలు నెల క్రితం జార్ఖండ్‌లోని రాంఘడ్ జిల్లా మదన్‌పూర్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌తో బువ్వలేక.. బయటపడే మార్గం కానరాక ఇబ్బందిపడ్డారు. దీంతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు వాట్సాప్ సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.