గణపతి లొంగుబాటుపై తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-09-01T23:48:23+05:30 IST

మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోతే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు

గణపతి లొంగుబాటుపై తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోతే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. బంధువులు, మిత్రుల ద్వారా గణపతి లొంగిపోతాననడం మంచిదేనన్నారు. ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గతంలో లొంగిపోయిన జంపన్న, సుధాకర్‌ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో గణపతికి కూడా అలాగే సహకరిస్తామని హామీ ఇచ్చారు. లొంగుబాటు ప్రక్రియకు పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచే ఉన్నాయని వెల్లడించారు. గణపతికి మానవతా ధృక్పథంతో సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పునరావాస ప్రక్రియ కింద ఇప్పటి వరకూ 1137 మంది లొంగిపోయారని తెలిపారు. గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోతున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. ఇంకెవరైనా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ భరోసా ఇచ్చింది.

Updated Date - 2020-09-01T23:48:23+05:30 IST