నా దృష్టిలో రేవంత్ రెడ్డి లీడరే కాదు: మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-10-28T20:12:05+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ఒకప్పుడు

నా దృష్టిలో రేవంత్ రెడ్డి లీడరే కాదు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. మీడియాతో కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపోమాపో బీజేపీలోకి పోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2020-10-28T20:12:05+05:30 IST