మరో భూవివాదంలో కీసర తహశీల్దార్ నాగరాజు

ABN , First Publish Date - 2020-08-18T17:07:47+05:30 IST

కీసర తహశీల్దార్ నాగరాజు మరో భూవివాదంలో చిక్కుకున్నారు.

మరో భూవివాదంలో కీసర తహశీల్దార్ నాగరాజు

మేడ్చల్: కీసర తహశీల్దార్ నాగరాజు మరో భూవివాదంలో చిక్కుకున్నారు. కీసర గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 173, 174, 175, 179 ,230లో ఉన్న మొత్తం 94 ఎకరాల భూమిని 38 కౌలుదారులకు  ఒక్కొక్క కుటుంబానికి 9 ఎకరాల చొప్పున  భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలోపంపిణీ చేశారు. దీంట్లో 18 ఎకరాల భూమిని రెండు కుటుంబాలు అమ్మకాలు చేశాయి. అయితే భూమిని కబ్జా చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తమ భూమి తమకు దక్కాలంటూ భూమి ఎదుట బాధితులు గతంలో 40 రోజులు ధర్నాకు దిగారు. ఈ భూమి కోసం బాధితులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కేసులో ఉండగా ఎమ్మార్వో నాగరాజు భూ మార్పిడి చేసి వేరే వ్యక్తులకు పాస్ బుక్కులు కూడా జారీ చేశాడని ఆరోపణలు చేశారు.  భూ మార్పిడి చేయడం వల్లనే హెచ్ఎండీఏ అధికారులు వెంచర్ చేయడానికి అనుమతులు ఇచ్చారని... వ్యవసాయ భూమిని ప్లాట్ల కోసం భూ మార్పిడి చేశాడని తాసిల్దార్ నాగరాజుపై బాధితులు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపైన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-08-18T17:07:47+05:30 IST